Natyam ad

48 గంటల్లో చోరీ నిందితుల అరెస్టు

మదనపల్లె ముచ్చట్లు:


వీఆర్ఎల్  లాజిస్టిక్స్ లిమిటెడ్ నందు చోరీ చేసిన నిందితులను 48 గంటల్లో పట్టుకుని, చోరీ సొత్తు రికవరీ చేయడం  జరిగిందని డిఎస్పీ కేశప్ప తెలిపారు. గురువారం  మదనపల్లె టుటౌన్ పోలీస్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు మహబూబ్ బాషా, సత్యనారాయణ, ఎస్ఐ హేమాద్రి ఉన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఇండస్టియల్ ఎస్టేట్ నందున్న విఆర్ ఎల్  లాజిస్టిక్స్ గోడౌన్ నందు తాళాలు కోసి అందులో ఉన్న 478 జరీ రీళ్లను కొందరు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదు మేరకు సిసి కెమెరాలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన వెంకటరమణ, సత్యనారాయణలను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి ఒక కారు, 5.50 లక్షల రూపాయలు విలువ చేసే జరీ రీళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు.

 

Tags: Arrest of theft accused within 48 hours

Post Midle
Post Midle