Natyam ad

దొంగతనముల కేసులలో ముగ్గురు ముద్దాయిల అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనము”

వాయల్పాడు ముచ్చట్లు:

వాయల్పాడు మండలము, చింతపర్తి గ్రామము, బజారు వీధిలో కాపురముండు పువ్వాడ వెంకటరమణయ్య శెట్టి ఇంటిలో గత సంవత్సరము డిసెంబర్ నెల 21వ తేదీ అర్ధరాత్రి సమయములో మరియు కలికిరి టౌన్, అమరనాథ రెడ్డి కాలనీ లో ఈ సంవత్సరము జూలై నెల 29వ తేదీ అర్ధరాత్రి సమయములో రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని కావలి రాజమ్మ ఇంటిలో దొంగతనాలకు పాల్పడి బంగారు నగలను చోరీ చేసిన తండ్రి, ఇద్దరు కుమారులను అరెస్టు చేసి, వారి నుండి పై రెండు కేసులలోని చోరీ సొత్తులను వాయల్పాడు. CI   P. సురేష్ కుమార్  స్వాధీనము చేసుకోవడమైనది.

Post Midle

ముద్దాయిల వివరాలు:

1) మేకల గుర్రప్ప, వయస్సు 60 సంవత్సరములు, తండ్రి: Late M.రామక్రిష్ణ, కులము: వాల్మీకి, వృత్తి: వ్యవసాయము, నివాసము: మేకలవారిపల్లి, చింతపర్తి గ్రామము, వాయల్పాడు మండలము, అన్నమయ్య జిల్లా. (వివిధ దొంగతనముల కేసులలో పాత నేరస్తుడు, ఇతనిపై వాయల్పాడు PS లో Suspect Sheet No: 611 వున్నది)..

2) మేకల హరివేంద్ర, వయస్సు 22 సంవత్సరములు, తండ్రి: M. గుర్రప్ప, కులము: వాల్మీకి, వృత్తి: వ్యవసాయము, నివాసము: మేకలవారిపల్లి, చింతపర్తి గ్రామము, వాయల్పాడు మండలము. 3) మేకల దేవేంద్ర, వయస్సు 25 సంవత్సరములు, తండ్రి: M. గుర్రప్ప, కులము: వాల్మీకి, వృత్తి: వ్యవసాయము, నివాసము; మేకలవారిపల్లి, ప్రస్తుతము BC కాలనీ, చింతపర్తి గ్రామము, వాయల్పాడు మండలము.

నేరము చేయు నేపధ్యము:

వీరు ముందుగా ఇండ్లకు తాళము వేసి, లోపల ఎవరూ లేరని భావించి, అలాంటి ఇండ్లను ముందుగా పగటి పూట గుర్తించి, రాత్రి వేళ వెళ్లి, ఇండ్ల తాలములను పగులగొట్టి, ఇంటిలోనికి ప్రవేశించి, బీరువా తాళాలు పగులగొట్టి, అందులో నుండి బంగారు ఆభరణములు, నగదు దొంగిలిస్తారు.

పై ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకున్న బంగారు నగల వివరాలు:

1) వాయల్పాడు పోలీస్ స్టేషన్ Cr.No : 140/2022 u/s 457, 380 IPC కేసు లోని చోరి సొత్తు అయిన

(1) 35 గ్రాముల బరువుగల నాలుగు బంగారు గాజులు, (2) 15 గ్రాముల బరువు గల రెండు బంగారు. రాళ్ళ గాజులు, (3) 15 గ్రాముల బరువుగల బంగారు నల్లపూసల చైను, (4) 05 గ్రాముల బంగారు.
ముత్యాల చైను, (5) 15 గ్రాముల బరువుగల ఒక సాదా బంగారు గాజు, (6) 15 గ్రాముల బరువుగల ఒక బంగారు సాదా నెక్లెస్, (7) 10 గ్రాముల బరువుగల బంగారు బ్రాస్లెట్, (8) 20 గ్రాముల బరువు గల బంగారు మైనరు చైను, (9) 15 గ్రాముల బరువుగల 3 జతల బంగారు ఉంగరాలు, (10) 15 గ్రాముల బరువుగల 4 జతల బంగారు కమ్మలు, (11) 24 గ్రాముల బరువుగల ఒక లక్ష్మి డిజైస్ బంగారు సాదా నెక్లెస్, (12) 24 గ్రాముల బరువుగల ఒక బంగారు సాదా నెక్లెస్, (13) 09 గ్రాముల బరువుగల ఒక జర బంగారు చెంప సరాలు, (14) 03 గ్రాముల బరువుగల ఒక రాళ్ళ డాలరు, (15) 30 గ్రాముల బరువుగల ఒక సాదా నెక్లెస్, (16) 40 గ్రాముల బరువుగల నాలుగు బంగారు గాజులు, (17) 10 గ్రాముల బరువుగల ఒక మైనర్ చైను, మొత్తం సుమారు 300 గ్రాములు బంగారు నగలు, మతింపు సుమారు Rs.7,20,000/-,

2) కలికిరి పోలీస్ స్టేషన్ Cr.No:77/2023 u/s 457, 380 IPC కేసులోని చోరి సొత్తు అయిన (1) ఒక బంగారు నల్ల పూసల చైను సుమారు తూకం 20 గ్రాములు, (2) బంగారు నక్లెస్ సుమారు తూకం 20 గ్రాములు, (3) ఒక బంగారు లాంగ్ చైను సుమారు తూకం 20 గ్రాములు, (4) ఒక బంగారు పగడపు ఉంగరం సుమారు తూకం 05 గ్రాములు, (5) ఒక బంగారు సాయిబాబా ఉంగరం సుమారు తూకం 04 గ్రాములు, మొత్తము సుమారు 69 గ్రాముల బంగారు నగలు, మతింపు సుమారు Rs.2,07,000/-

3) పై రెండు నేరములను చేయుటకు ఉపయోగించిన KA01-ES-4414 నంబరు గల పసుపు రంగు అపాచి మోటార్ సైకిల్.

అన్నమయ్య జిల్లా S.P.   R. గంగాధర్ రావు I.P.S  ఆదేశములు మరియు సమాచారము మేరకు రాయచోటి DSP   S. మహబూబ్ బాష  పర్యవేక్షణలో వాయల్పాడు CI   P.సురేష్ కుమార్, కలికిరి SI శ్రీ S.K.రహీముల్లా, ASI   N. మధుసూదనాచారి, వాయల్పాడు సిబ్బంది HC   S. దస్తగిరి, PCలు B. సతీష్, T. అబ్దుల్లాలు, అన్నమయ్య జిల్లా టెక్నికల్ టీం మెంబెర్ HC. 159 A. రవిశేఖర్ లు 26-08-2023వ తేదీ సాయంత్రం 06:00 PM గంటలపుడు వాయల్పాడు మండలం, విటలం బస్టాపు దగ్గర పై ముగ్గురు ముద్దాయిలని అరెస్టు చేసి, పై రెండు కేసులలోని మొత్తము చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది.

 

Tags:Arrest of three accused in theft cases, possession of stolen property”

Post Midle