Arrest of three inter-district burglars

ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్

141 గ్రాముల బంగారం,రూ.47500 నగదు స్వాదినం

Date:04/12/2019

సోమల ముచ్చట్లు:

అంతర్ జిల్లాల దోంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పలమనేరు డిఎస్పీ ఆరిపూల్లా పేర్కోన్నారు.ఆయన వివరాల మేరకు మండలంలోని కందూరులోని కన్యకాపరమేశ్వరి గుడిప్రక్కన కాపురం ఉన్న సంధ్యరాణి సమీపంలోని తన చెల్లెలు ఇంటికి పడుకొనుండగా గత నెల 24,25 న ఆరోజు రాత్రి తన ఇంటిలో దోంగతనం జరిగినట్లు సోమల పోలీసులకు పిర్యాదు చేసిందని దీనిపై స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుండగా ఎస్ఐ లక్ష్మీకాంత్ తన సిబ్బందితో బుధవారం సుమారు 2 గంటల సమయంలో వాహనాలు తనీఖీ చేస్తుండగా టివిఎస్ ఎక్సల్ AP 03 CV 2535 ద్విచక్ర వాహనంలో ముగ్గురు వ్యక్తులు వస్తూవుండటంతో అనుమానం వచ్చి వారిని పట్టుకోని విచారిస్తే కందూరులో దొంగతనం చేసినవారుగా గుర్తించామని తెలిపారు.విచారణలో వారి వద్ద నుండి సుమారు రూ.5,07,000 లక్షల విలువ గల 141 గ్రాముల బంగారం,రూ.47500 నగదును,టివిఎస్ ఎక్సల్ ద్విచక్ర వాహనం స్వాదినం చేసుకోవడం జరిగిందని తెలిపారు.వీరిపై గతంలో కూడా నిమ్మనపల్లె, రామసముద్రం, చౌడేపల్లె, సుండుపల్లె, చిన్నమడ్యం,భాకరపేట, రొంపిచెర్ల,పీలేరు,కలికిరి, పోలీస్టేషన్లల పరిధిలో దొంగతనాలు చేసినవారని గుర్తించామని తెలిపారు.వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.కేసును సకాలంలో చేదించిన ఎస్ఐ లక్ష్మీకాంత్, తన సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

 

పోలీసుల బీమా పెంపు

 

Tags:Arrest of three inter-district burglars

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *