Natyam ad

సహారా రీజనల్, బ్రాంచ్ మేనేజర్లకు అరెస్ట్ వారెంట్ జారీ…

అరెస్ట్ వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్…

ఈ మేరకు చెన్నై పోలీసు కమిషనర్, నెల్లూరు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్

కోర్టు ధిక్కరణకు గానూ అరెస్ట్ వారెంట్ జారీ

 

Post Midle

నెల్లూరు ముచ్చట్లు:

 

కోర్టు దిక్కరణకు గాను సహారా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రీజనల్ మేనేజర్, నెల్లూరు బ్రాంచ్ మేనేజర్లకు గురువారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు చెన్నై పోలీసు కమిషనర్, నెల్లూరు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2022 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లా పెడ్డపడుగుపాడుకు చెందిన మొహమ్మద్ పర్వీన్ కు రూ.65,100 లు 24 శాతం వడ్డీతో తీర్పు వెలువడిన 45 రోజుల్లోగా చెల్లించాలని సహారా సొసైటీని ఆదేశిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఆదేశాలు పాటించకపోవడంతో సహారా సొసైటీ చెన్నై రీజనల్ మేనేజర్, నెల్లూరు బ్రాంచీ మేనేజర్లకు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు.

 

Tags: Arrest warrant issued to Sahara regional and branch managers…

Post Midle