దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

 

జ్యూడీషియల్‌ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 100 రోజులకు పైగానే ఆమె జైలులో ఉంటున్నారు. కవిత అటు రౌస్ అవెన్యూ కోర్టులోనూ బెయిల్ దొరకలేదు.. ఇటు ఢిల్లీ హైకోర్టులోనూ దొరకట్లేదు. రిమాండ్ గడువును న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ కేసులో కవిత అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. కానీ.. కవిత అప్రూవర్‌గా మారకుండా ఉండడానికి.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి.. వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తోందన్నారు శ్రీనివాస్ రెడ్డి. భూస్వాములకు, రియల్టర్లకు రైతుబంధు నిలిపేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి.. రేవంత్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలను రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారన్నారు. నిరంతరం ప్రజల కోసం తపనపడుతున్నాడని తెలిపారు. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేశారని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు.బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కేసీఆర్ పరిష్కరించలేని భూసమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లేందుకు కేసీఆర్ భయపడితే.. రేవంత్ రెడ్డి మాత్రం ధైర్యంగా వెళ్లి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథకు రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అందులో మొత్తం అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. అసెంబ్లీకి కేసీఆర్ రావాలంటూ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

 

Tags:Arrested in Delhi Liquor Scam case which became a sensation in the country

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *