బెట్టింగ్ రాయుళ్లు ఆరెస్టు

Date:20/10/2020

పాలకొల్లు ముచ్చట్లు

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానుల్లో ఒకరకమైన ఉత్కంఠ నెల కుంటూ ఉంటే మరో వైపు బెట్టింగ్ రాయులు మాత్రం ఇదే అదునుగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు వీరిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఇదే తరుణంలో ఒక టైలరింగ్ దుకాణంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న పాలూరి పాపారావు అనే క్రికెట్ బుకీ ని అరెస్ట్ చేసి అతని సమాచారంతో మరో 11 మందిని అరెస్టు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీసులు వీరి నుండి లక్షా ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల (1,08,250) నగదు 12 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా మరో ఐదుగురిని అరెస్టు చేయవలసి ఉందని దీనిలో ప్రధాన బుకి రాజమండ్రికి చెందిన దేవి శంకర్ అనే వ్యక్తి ఉన్నాడని అందరిపై కేసు నమోదు చేశామని సి.ఐ.ఆంజనేయులు తెలియజేశారు ఇదే విధంగా ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని క్రికెట్ బెట్టింగ్ సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

త్వరలో వైఎస్సార్ జన చైతన్య యాత్ర

Tags:Arresting betting royals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *