13న జొన్నగిరి గ్రామానికి ఎమ్మెల్యే శ్రీదేవి రాక
తుగ్గలి ముచ్చట్లు:
తుగ్గలి మండల పరిధిలోని గల ఎమ్మెల్యే దత్తత గ్రామమైన జొన్నగిరి గ్రామానికి ఈనెల 13న,శుక్రవారం రోజున ఉదయం 9:30 గంటలకు పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి వస్తున్నట్లు తుగ్గలిమండల కన్వీనర్ జిట్టా నాగేష్ మరియు కన్వీనర్ హనుమంతు లు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జొన్నగిరి గ్రామం నందు వైద్య ఆరోగ్యశాఖ వారు నిర్వహించు జగనన్న ఆరోగ్య సురక్షకార్యక్రమం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరవుతున్నట్లు వారు తెలియజేశారు. అదేవిధంగా జొన్నగిరి గ్రామం నందు నూతన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే
పాల్గొంటారని వారు తెలియజేశారు. కావున జొన్నగిరి గ్రామం నందు శుక్రవారం జరిగే కార్యక్రమానికి వైసీపీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు,గ్రామ వాలంటీర్లు మరియువైసీపీ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Tags: Arrival of MLA Sridevi to Jonnagiri village on 13th

