కేంద్రం పై బాణం ఎక్కుపెట్టిన టీడీపీ ఐటీ దాడులు

Arrow strikes on the center of TDP IT attacks

Arrow strikes on the center of TDP IT attacks

Date:12/10/2018
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో మళ్లీ ఐటీ దాడులు కలకలంరేపుతున్నాయి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. కడప, హైదరాబాద్‌లో ఏకకాలంలో శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతవారంలో కూడా టీడీపీ నేతలు, ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయగా.. మళ్లీ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ దాడులు ముమ్మాటికీ కక్షసాధింపులో భాగమేనంటున్నారు మంత్రులు, టీడీపీ నేతలు. కేంద్రం కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు జరుగుతున్నాయంటూ మండిపడుతున్నారు. కడప ఉక్కు పరిశ్రమపై పోరాటం చేసినందుకే సీఎం రమేష్‌ను టార్గెట్ చేశారంటున్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఐటీ సోదాలతో అందర్ని భయపెట్టాలని చూస్తున్నారని.. ఈ కుట్రలపై పవన్, జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
కేంద్రం కుట్రలో భాగంగా దాడులు చేస్తున్నారని.. ఇలా చేస్తే రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ కంటే ఎక్కువగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయనే ఈర్ష్య ఉందన్నారు. బీజేపీ వ్యతిరేకుల్ని కేసుల్లో ఇరికించాలనే కుట్ర జరుగుతోందన్నారు మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మోదీ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని.. కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతున్న ఎంపీ సీఎం రమేష్‌పై ఐటీని ఉసిగొల్పారన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు. హామీలు నెరవేర్చమని ప్రశ్నించినందుకే కక్షపూరితంగా ఐటీ దాడులు చేయిస్తోందన్నారు మంత్రి నక్కా ఆనందబాబు.
టీడీపీ నేతలను నైతికంగా దెబ్బ తీయడానికే ఈ సోదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ఇలా రాజకీయ కక్షసాధింపు కోసం ఉపయోగించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై పెట్టిన కేసులు జోలికి పోరని.. ఆయనకు కేంద్రం సహకరించడంతోనే ఆ కేసులు ముందుకెళ్లడం లేదన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయగలరా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.
బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో వేల కోట్లకు అధిపతులు ఉన్నారని.. వారి జాబితా ఇస్తే సోదాలు చేయగల దమ్ముందా అన్నారు. మోదీ వెనుక మంత్రి శక్తి ఉంటే.. చంద్రబాబు వెనుక దైవ భక్తి ఉందన్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందన్నారు మరో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు. జగయన్ ఆస్తుల విషయంలో కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందో చెప్పాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే సీఎం రమేష్ ఇళ్లు, కంపెనీల్లో సోదాలు చేస్తున్నారని విమర్శించారు.
Tags:Arrow strikes on the center of TDP IT attacks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *