Arshad Ali, examined by the Quarantine Center

క్వారంటైన్‌ సెంటర్‌ పరిశీలించిన అర్షద్‌అలి

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ ముస్లిం నాయకుడు, కౌన్సిలర్‌ అభ్యర్థి అర్షద్‌ అలి క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలించారు. సెంటర్‌లో పట్టణానికి చెందిన ముస్లింలు ఉన్నారు. పట్టణంలో వారి కుటుంబాలు ఆందోళన చెందుతుండటంతో ఆయన వెళ్లి పరామర్శించి , 14 వ తేదీ వరకు ఉండాలని సూచించారు. అలాగే కౌన్సిలర్‌ అభ్యర్థి అమ్ము, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ సెంటర్‌లో ఉన్న ముస్లింలను పరామర్శించారు. ఈ సందర్భంగా అమ్ము, అర్షద్‌అలి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సెంటర్‌లో అన్ని వసతులతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.అధికారులను , సిబ్బందిని ప్రశంసించారు. ప్రజలందరు ఇండ్లలోనే ఉంటు పోలీసులకు, మున్సిపల్‌ అధికారులకు సహకరించి, స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు.

YSRCP Muslim leader and councilor candid
YSRCP Muslim leader and councilor candid

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి

Tags: Arshad Ali, examined by the Quarantine Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *