వేరుశనగతో మార్కెట్‌లో కళకళ..

Date:20/02/2018
వరంగల్ ముచ్చట్లు:
రైతుల ఇంట సిరుల పంట పండింది.. గతంతో పోల్చితే ఈ యాసంగిలో వేరుశనగ ఎక్కువ విస్తీర్ణంలో సాగైంది. దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2.60 లక్షల ఎకరాలలో పంటను సాగు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,24,460 ఎకరాలలో పంట సాగు కావడంతో రాష్ట్రంలో అధికంగా సాగైన జిల్లాగా పేరొందింది. ప్రస్తుతం పంట చేతికి రాగా మార్కెట్లు వేరుశనగ రాసులతో కళకళలాడుతున్నాయి. సాగు అధికంగా కావడంతో ప్రభుత్వం మొదటి సారి వేరుశనగ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించింది. ఈ కేంద్రాలలో మద్దతు ధర లభిస్తుండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో వేరుశనగ పంటను సాగు చేసిన రైతుల పంట పండింది. గతేడాదికన్నా ఈసారి అధికంగా పంట సాగు చేపట్టారు. దిగుబ డి కూడా బాగా వస్తుండటంతో ఈ పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. 2.60 లక్షల ఎకరాలలో సాగు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2,60,755 ఎకరాలలో వేరుశనగ పంటను ఈ యాసంగింలో సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. ప్రా జెక్టుల్లోకి నీరు రావడంతో ఎంజీకేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు, చెరువులను కృష్ణా నీటితో నిం పారు. దీంతో కాలువలకు నీటిని వదలడంతో సా గుబడులు పెరిగాయి. నీటి సౌలభ్యం పెరగడంతో మొదట వేరుశనగ సాగుకు రైతన్న ప్రాధాన్యమిచ్చాడు. ఆ తర్వాత వరిని సాగు చేశాడు. అయితే గతేడాదికన్నా ఈసారి 20 శాతం వేరుశనగ సాగు పెరిగింది. యాసంగి సీజన్‌లో ఉమ్మడి జిల్లా రైతన్నలు అధికంగా వేరుశనగను సాగు చేసారు. నేడు పంట చేతికందుతున్నది. పలు ప్రాంతాల్లో వేరుశనగను మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో ఏ మార్కెట్‌లో చూసినా వేరుశనగ రాసులే దర్శనమిస్తున్నాయి. నీటి వసతి ఉండటంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో రైతన్న ఇంట సిరులు నిండాయి. గతంలో ఎప్పుడూ యాసంగి సీజన్‌లో ఇంత పెద్ద మొత్తంలో వేరుశనగ పంట సాగైన దాఖలాలు లేవు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు తొలిసారిగా ప్రభుత్వం వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మద్దతు ధర రూ.4250 లుగా నిర్ణయించింది. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, గద్వాల, పెబ్బేరు, మదనాపురం, మక్తల్, దేవరకద్ర మార్కెట్లు వేరుశనగతో కళకళలాడుతున్నాయి. యాసంగి సీజన్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,24,460 ఎకరాల్లో వేరుశనగ పంట సాగైంది. ఇంత ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో ఎక్కడా సాగు కాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా 57 వేల ఎకరాల్లో, వనపర్తి జిల్లాలో 55 వేల ఎకరాలు, గద్వా ల జిల్లాలో 23,302 ఎకరాలలో పంట సాగైంది. దిగుబడులు సైతం గతంలోకంటే అధికంగా వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. యాసంగిలో సాగు చేసిన వేరుశనగ దిగుబడి ఆశాజనకంగా ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో బోరు బావులపైనే ఆధారపడి పంటను సాగు చేయగా.. నేడు ఎత్తిపోతల ద్వారా నీటిని అందిస్తుండటంతో పంటు సాగు పెరిగింది. గతంలో ఎకరాకు 5 నుంచి 6 క్వింటా ళ్లు మాత్రమే దిగుబడి రాగా.. నేడు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎత్తిపోతల పుణ్యమా అని రెండేళ్ల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా రూపురేఖలే మారా యి. గతంలో నీటి సౌలభ్యం లేక వానకాలం పంట సాగు అనంతరం బతుకు దెరువు కోసం ఇతర పట్టణాలకు వలస వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. కృష్ణా జలాలను ఒడిసి పట్టేందుకు ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించారు. రిజర్వాయర్లు, చెరువులను నింపారు. కా లువలకు నీటిని వదిలారు. దీంతో బీళ్లుగా దర్శనమిచ్చిన పొలాలు సైతం సాగులోకి వచ్చాయి. ఏడాదికి రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. సొంత ఊళ్లల్లోనే వ్యవసాయం బాగా ఉండటంతో వలసలు వెళ్లిన వారు సైతం తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 675 చెరువులను నీటితో నింపారు. ఎంజీకేఎల్‌ఐ పరిధిలో 400 చెరువులు, భీమా ఫేస్-2లో 105, నెట్టెంపాడ్‌లో 100, భీమా ఫేస్-1లో 45, కోయిల్‌సాగర్ పరిధిలో 25 చెరువులను నింపారు. ఎండా కాలమంతా బతుకు దెరువుకు వలస వెళ్లేవాళ్లం.. ఈ ఏడాది ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు రావడంతో రిజర్వాయర్లు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వ్యవసాయం పెరిగింది. ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి. నాకున్న కొంత భూమిలో అర ఎకరాలో వేరుశనగ సాగు చేశాను. కరెంటు సమస్య లేదు. దీంతో వేరుశనగ సాగు చేశా.. ఖర్చులన్నీ పోనూ రూ.10 వేలు మిగిలాయి.
Tags: Artwork in market with peanut ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *