Date:17/01/2021
చీరాల ముచ్చట్లు:
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చీరాలకు చెందిన ఐఎల్టిడి రిటైర్డ్ మేనేజర్ అర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు ఐదు లక్షలా యాభై వేల ఐదువందల యాభై ఎనిమిది రూపాయల విరాళాన్ని ఆదివారం అందజేశారు. ఆరెస్సెస్ నాయకుడు వారణాసి మల్లిఖార్జునరావు కి ఈ మొత్తానికి చెక్కును ఆయన ఇవ్వడం జరిగింది.బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బండ లక్ష్మీప్రసాద్,ఎం. ఆంజనేయశర్మ ,బీజేపీ నాయకులు మువ్వల వెంకటరమణారావు,బుర్ల రాము,శంకర్రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా కోటేశ్వర్రావ్ సత్యవతి దంపతులకు వారు శాలువా కప్పి సన్మానించారు.
కొవిడ్ వ్యాక్సిన్ నిరంతరం కొనసాగే ప్రక్రియ: మంత్రి ఈటల
Tags;Arvapalli Koteshwara and Satyavati donate for the construction of Ramalaya in Ayodhya