పుంగనూరు మున్సిపాలిటికి ఆర్వో, టీపీవోలు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో ఖాళీగా ఉన్న రెవెన్యూ ఆఫీసర్, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు ఉద్యోగులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషనర్ రసూల్‌ఖాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నిడదవోలు మున్సిపాలిటిలో పనిచేస్తున్న కె.దుర్గాహరిమోహన్కు రెవెన్యూ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పిస్తూ , ఇక్కడికి బదిలీ చేసినట్లు తెలిపారు. అలాగే పెద్దాపురం మున్సిపాలిటిలో పనిచేస్తున్న వి.శేషగిరికి పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌గా నియమించినట్లు కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటిలో అన్ని ఖాళీలు భర్తీ అయిందని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Arvo and Tipivolu to Punganur Municipality