Natyam ad

వై.ఎస్ షర్మిల  అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుండి టూ ప్లస్ టూ గా భద్రత పెంచాం

భద్రతా ప్రమాణాల(స్కేల్) మేరకు భద్రత కల్పిస్తున్నాం

జిల్లా ఎస్.పి  సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ వెల్లడి

 

కడప ముచ్చట్లు:

Post Midle

పి.సి.సి అధ్యక్షురాలు   షర్మిల  అభ్యర్థన మేరకు రాష్ట్ర .డి.జి.పి  ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని జిల్లా ఎస్.పి  సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్  తెలిపారు. భద్రతా ప్రమాణాల నిబంధనల(స్కేల్) మేరకు భద్రతా కల్పించడం జరిగిందని ఎస్.పి  వివరించారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫారసు(సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎస్.పి  వివరించారు.

 

Tags:As per the request of YS Sharmila, we have increased the security from the existing one plus one to two plus two

Post Midle