మద్యం తాగేందుకు డబ్బులు సరిపోకపోవడంతో.. చివరికి ఏకంగా బోర్ వెల్ లారీనే మాయం
గుంటూరు ముచ్చట్లు:
తెల్లవారిన తర్వాత వచ్చి చూస్తే బోరు బండి మాయమైంది. ఏమైందో యజమానికి అర్థం కాలేదు. దీంతో రాజ్యలక్ష్మి అరండల్ పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచిత్రమైన కేసు కావటంతో.
గుంటూరు నగరంలో భారత్ పేట నాలుగో లైన్ లో బోరు లారిని పార్క్ చేశారు. తెల్లవారిన తర్వాత వచ్చి చూస్తే బోరు బండి మాయమైంది. ఏమైందో యజమానికి అర్థం కాలేదు. దీంతో రాజ్యలక్ష్మి అరండల్ పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచిత్రమైన కేసు కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రి సమయంలో నగరంలో నుంచి బయటకు వెళ్ళిన బోరు బండి ఆధారాలను సీసీ కెమెరాల ద్వారా సేకరించారు. నగరంలోకి మల్లిఖార్జున పేటకు చెందిన సాంబశివరావు, చెంచురామయ్య, అభిషేక్ ఒక ముఠాగా ఏర్పడ చోరి లకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ ముగ్గురు చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఈ క్రములోనే బోరు బండిని అపహరించ ఏటుకూరు తరలించారు. అక్కడ ఒక గోడౌన్ లో దాన్ని దాచి పెట్టారు.

Tags: As the money is not enough to drink alcohol.. In the end Bor Well Laurie is wasted
