అనుకున్నట్టే జరిగింది, కరీంనగర్ హత్య వెనుక కొత్త నిజాలు

As was done, new facts behind the murder of Karimnagar

As was done, new facts behind the murder of Karimnagar

Date:10/10/2018
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లాలో 23 ఏళ్ల యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది కచ్చితంగా హత్యేనని, ప్రేమించిన పాపానికి అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుమార్ ప్రియురాలు కూడా ఇదేమాట అంటోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి కుమార్.. ఇంటర్ విద్యార్థినిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. అయితే ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుమార్‌ను ఆమె కుటుంబసభ్యులు పలు మార్లు హెచ్చరించారు. దీన్ని కుమార్ లెక్కచేయలేదు.
అమ్మాయితో కలిసి ఈనెల 6న బస్సులో నిజామాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి కుమార్ వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తాడికల్‌కు తిరిగి వచ్చాడు. మరుసటి రోజే అమ్మాయి కుటుంబ సభ్యులు తాడికల్ నుంచి కుమార్‌ను బైక్‌పై తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి 9 గంటల తరవాత కూడా కుమార్ ఇంటికి చేరుకోకపోవడంతో అతడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలోనే కుమార్ తను ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేశాడు. తాను చింతగుట్ట వద్ద ఉన్నానని.. తనను చంపేస్తారేమోనని భయంగా ఉందని ఆమెకు చెప్పాడు. అమ్మాయి ఈ విషయాన్ని కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. కుమార్ తండ్రి గడ్డి సారయ్య వెంటనే కుమారుడికి ఫోన్ చేయగా స్విఛాప్ వచ్చింది.
సోమవారం ఉదయం సారయ్య శంకరపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన కొడుకు కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తాడికల్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పత్తి చేనులో గడ్డి కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుమార్ తల్లిదండ్రులు.. కుమారుడి మృతదేహం వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అలాగే అతడి ప్రియురాలు కూడా అక్కడి చేరుకుని బోరున విలపించింది. అయితే తాను సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తన కుమారుడి హత్యకు పోలీసులు కూడా ఒక కారణమని సారయ్య ఆరోపిస్తున్నారు.
కానీ తాము కేసు నమోదు చేశామని పోలీసులు ఎఫ్ఐఆర్‌ను సాక్ష్యంగా చూపుతున్నారు. అయితే సారయ్య ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఈ ఘాతుకం జరిగేది కాదని ఆరోపిస్తూ.. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కరీంనగర్-వరంగల్ హైవేపై మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. కరీంనగర్ అదనపు డీసీపీ సంజీవ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకొని బాధితులతో మాట్లాడారు.
విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. ఒక దశలో ఎస్సైపై దాడి చేశారు. పోలీసు వాహనంపై అద్దాలు పగలగొట్టారు. కాగా, గడ్డి కుమార్ యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. అతని ప్రియురాలు గౌడ కులస్థురాలు. కులాలు వేరు కావడంతోనే అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని, ఇది కూడా కుల హత్యే అని అంటున్నారు.
Tags:As was done, new facts behind the murder of Karimnagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *