పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రంలోని పేద వర్గాల ఆశజ్యోతిగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నాఎని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మూడవ రోజు మండలంలోని చండ్రమాకులపల్లె, బోడేవారిపల్లె, సుగాలిమిట్ట , పాళ్యెంపల్లె గ్రామాల్లో ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డితో కలసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఎంపిపి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీకి 10 పెన్షన్లు ఉండేదన్నారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న మేరకు గ్రామంలో వందలాది మందికి పెన్షన్లు ఇస్తున్నారని , ప్రతియేటా పెంచడం చరిత్ర సృష్టించడమేనన్నారు. ప్రభుత్వ పథకాలన్ని ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్, గౌరమ్మ, ఎంపిటిసిలు శైలజరెడ్డి, ధరణి, మాజీ ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, వైఎస్సార్ ఆర్టీసి మజ్దూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి,పార్టీ నాయకులు జివిఎస్.రాంబాబు, చంద్రారెడ్డి యాదవ్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Asha Jyoti Jaganmohan Reddy-MPP Bhaskar Reddy of the poor