బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:
 
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే అని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. అభ్యుదయవాది మహిళా విద్య మహిళా సాధికారతకు తోడ్పాటు అందించిన   సావిత్రిబాయి పూలే  జయంతిని స్థానిక జడ్పీ హైస్కూలు ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె కీర్తిని గూర్చి వివరించి ఆమె స్పూర్తితో జీవించాలని తెలియచేశారు. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారిణి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసని, కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని ఆయన తెలియజేశారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణిగా, స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి పేరుప్రఖ్యాతులు గడించారని ఆయన ఆమె సేవలను కొనియాడారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ అరుణమ్మ, శేషాద్రినాయుడు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Asha Jyoti Savitribai Poole – Sarpanch Srinivasureddy

Natyam ad