Natyam ad

ఆశావర్కర్లకు  సెలవులు ఇవ్వాలి….15వేలకు  వేతనం వెంటనే పెంచాలి

జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి  వేణుగోపాల్ డిమాండ్

 

అమరావతి ముచ్చట్లు:


రాష్ట్రంలో గర్భవతులకు, బాలింతలకు, నవజాత శిశువులకు సేవలు అందిస్తున్న ఆశాలకు సెలవులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి. వేణుగోపాల్ జిల్లా అధ్యక్షురాలు కే. కల్పన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అయ్యవారమ్మ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నాడు ఏఐటీయూసీజిల్లా కార్యాలయంలో జరిగిన ఆశా కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎలాంటి ఉద్యోగ భద్రత క్యాజువల్ సెలవులు మేటర్నిటీ సెలవులు లేకుండా 24 గంటలు 365 రోజులు పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు సెలవులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆశా కార్యకర్తల కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైన మరణించిన కూడా ఆశా కార్యకర్తలు పోలేని పరిస్థితిని అధికారులు సృష్టిస్తున్నారని సెలవు కావాలని కోరితే ఉద్యోగం మానుకోవాలని భయపెడుతున్నారని ఇది

 

 

Post Midle

చాలా దుర్మార్గమని అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ గారిని సెలవులు విషయము మై అడుగగా సెలవులు మంజూరు చేస్తామని వాగ్దానం చేసి కూడా సంవత్సరం రోజులు గడుస్తున్న ఇంతవరకు ఆశాలకు సెలవులు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు వాగ్దానం చేసిన గౌరవ వేతనం 10వేల నుండి15వేల రూపాయలకు పెంచుతామని చెప్పిన మాటను నిలబెట్టుకుని తక్షణం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచక సెలవులు ఇవ్వక పోయిన యెడల రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు అమ్మలు మరియమ్మ సునంద లక్ష్మీ నరసింహ సంపతి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Asha workers should be given holidays….salary should be increased to 15 thousand immediately

Post Midle