ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి
జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి వేణుగోపాల్
కడప ముచ్చట్లు:
ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలనిఏపి ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి. వేణుగోపాల్, రాష్ట్ర అధ్యక్షురాలు పి. సుభాషిని, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అయ్యవారమ్మ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అంటువ్యాధులు రాకుండా గర్భవతులకు బాలింతలకు నవజాతా శిశువులకు వైద్య సేవలందిస్తూ ఉన్న ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్రంలో కనీస వేతన చట్టాన్ని అమలుచేసి ఆశాలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత, క్యాజువల్ సెలవులు, వెటర్నటీ, ప్రభుత్వ సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా పనిచేస్తున్నారని వా రాంతపు సెలవులు ఇవ్వాలని 15 క్యాజువల్ సెలవులు ఇవ్వాలని వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేసిన ఆశా కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానని వాగ్దానం చేసిన ప్రత్యేక ఆలగెన్సు 6 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశాలకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని అనేకమార్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసి ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దుర్మార్గమని అన్నారు. తక్షణం ఆశా కార్యకర్తలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వం అధికారులు ఎన్ని అడ్డంకులు పెట్టి అరెస్టులు చేసిన భయపడే ప్రసక్తే లేదని తక్షణం ఆశా ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు అనసూయ, సుబ్బలక్ష్మి, ఉమామహేశ్వరి, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags: ASHA workers should be recognized as medical employees
