శ్రీ‌నివాస‌మంగాపురంలో అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క శ్రీ‌నివాస మ‌హాయాగం

Date:15/10/2019

తిరుపతి ముచ్చట్లు:

శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో అక్టోబ‌రు 16 నుండి 18వ తేదీ వ‌ర‌కు అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క శ్రీ‌నివాస మ‌హాయాగం జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఆల‌యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 108 హోమ‌గుండాలు ఏర్పాటు చేశారు. వివిధ‌ రాష్ట్రాల‌కు చెందిన 108 మంది ప్ర‌ముఖ ఋత్వికులు పాల్గొన‌నున్నారు.

 

 

 

ఇందులో భాగంగా అక్టోబ‌రు 16న బుధ‌వారం ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఆచార్య‌వ‌ర‌ణం, విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, వాస్తుహోమం, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. అక్టోబ‌రు 17న ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు గో పూజ‌, శ్రీ భూ స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. అక్టోబ‌రు 18న ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు గ‌జ‌పూజ‌, పూర్ణాహుతితో మ‌హాయాగం ముగుస్తుంది. ఆల‌య డెప్యూటీ ఈవో   ఎల్ల‌ప్ప ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌ కలామ్‌కు విద్యార్థుల సలామ్‌

Tags: Ashtottara Shatavantha Spiritual Srinivasa Mahayagam in Srinivasamangapuram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *