రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి ఆసియా పల్స్ కంపెనీ

Asian Pulse Company for Industrial Industry

Asian Pulse Company for Industrial Industry

జనవరి 9న భూమిపూజ
Date:01/01/2019
ఒంగోలు ముచ్చట్లు:
చంద్రబాబు పడుతున్న కష్టం ఫలిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి మరో భారీ పెట్టుబడితో, అతి పెద్ద కంపెనీ రానుంది. దేశంలోనే పెద్ద విదేశీ పెట్టుబడి అయిన కియా మోటార్స్‌ తరువాత, ఇదే రెండో అతి పెద్ద పరిశ్రమ. రాష్ట్రానికి తలమానికంగా భావిస్తున్న ఆసియా పల్ప్‌ అం డ్‌ పేపర్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రకాశం జిల్లాలో భారీ కాగిత పరిశ్రమను ఆసియా పల్స్‌ అండ్‌ పేపర్‌ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 9న రామాయపట్నం సమీపంలో సీఎం చంద్రబాబు ఈ పరిశ్రమకు భూమిపూజ చేయనున్నారు. ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించడం.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలితో అవగాహనా ఒప్పందం చేసుకోవడం చకచకా జరిగిపోనున్నాయి.తొలిదశలో ఆసియా పల్స్‌ అండ్‌ పేపర్‌ రూ.28వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 15వేలమందికి ఉపాధి, 30లక్షల టన్నుల కాగితం ఉత్పత్తి చేస్తారు. సుబాబుల్‌, సరుగు తోటలు పెంచేందుకు 60వేలమంది రైతులతో ఇప్పటికే యాజమాన్యం ఒప్పందం చేసుకుంది.
తొలిదశలో రూ.28,000 కోట్ల పెట్టుబడితో 15వేల మందికి ఉపాధి కల్పించడం ద్వారా 30 లక్షల టన్నుల కాగితం ఉత్పత్తి చేయనున్నారు. ప్రకాశం జిల్లా రైతులు గతంలో సరుగుడు కొంతకాలం, ఆ తరువాత సుబాబులు కొంతకాలం వేశారు. రాబడి పెద్దగా లేకపోవడంతో నిలిపేశారు. తాజాగా, కాగిత పరిశ్రమ ఏర్పాటుతో రైతులు మళ్లీ సుబాబుల్‌, సరుగుడు తోటలను పెంచేందుకు వీలు కలుగుతుంది.దీనికి అనుబంధంగా పరిశ్రమలు రావాల్సి ఉన్నందున దోనకొండ పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చెందుతుందని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సముద్ర రవాణా ద్వారానే ముడిసరుకు దిగుమతి, ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంటారు.
అందుకే ఈ సంస్థ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను పరిశీలించింది. కాగితపు పరిశ్రమ ఏర్పాటు తర్వాత… ప్రతి నిమిషానికి ఒక వాహనం కాగితం లోడ్‌తో కంపెనీ నుంచి బయలుదేరుతుంది. ఇంత పెద్ద పరిశ్రమ మన రాష్ట్రంలో వస్తూ ఉండటంతో, మన రాష్ట్రంలో సుబాబుల్ రైతులకు మంచి డిమాండ్ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా టిష్యూ, ప్యాకింగ్‌, పేపర్‌కు బాగా గిరాకీ ఉన్నందున ఎగుమతులకు వీలుగా ఓడరేవుకు సమీపంలో భూములు కావాలన్న నిర్వాహకుల సూచనల పై రామాయపట్నంలోని పలు ప్రాంతాలను చూపించారు.
Tags:Asian Pulse Company for Industrial Industry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed