టీడీపీ నేతపై హత్యాయత్నం
పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం కలకలంరేపింది. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో అయనపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేసారు. ఘటనలో బాలకోటి రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయనను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. వెన్న కోటిరెడ్డి గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేసారు. రొంపిచర్ల వైసిపి ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Tags: Assassination attempt on TDP leader