కర్నూలులో హత్యా రాజకీయాలు

కర్నూలు  ముచ్చట్లు:
ఏపీలో సంచ‌ల‌న సృష్టించిన టీడీపీ నేత‌ల జంట హ‌త్య‌ల చుట్టూ రాజ‌కీయం వేడెక్కుతోంది. ఈ హ‌త్య‌ల‌పై టీడీపీ భ‌గ్గుమంటోంది. మామూలుగానే రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఈ హ‌త్యారాజ‌కీయాలు చాలా కామ‌న్‌. ఇక ఇప్పుడు జ‌రుగుతున్న హ‌త్యలు అయితే అగ్గిని రాజేస్తున్నాయి. అయితే పాణ్యంలో జ‌రిగిన ఈ హ‌త్య‌ల‌పై నారా లోకేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.హ‌త్య‌కు గురైన టీడీపీ నాయ‌కులు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డికి నివాళి అర్పించేందుకు నారా లోకేష్ ఈరోజు పాణ్యం వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డికి ఈ హ‌త్యల వెన‌క హ‌స్తం ఉంద‌ని ఇప్ప‌టికే వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు లోకేష్ వ్యాఖ్య‌లు ఆజ్యం పోశాయి.జ‌గ‌న్‌కు ధైర్యం ఉంటే సీబీఐతో ఎంక్వ‌యిరీ వేయించాల‌న్నారు. స్థానికంగా ఉన్న ఓ కుక్క బాగా మొరుగుతోంద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు నారా లోకేష్‌. అయితే ఈ కామెంట్ల‌తో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఫైర్ అవుతున్నారు. నిజాలు తెలియ‌కుండా మాట్లాడుతున్నారంటూ భ‌గ్గుమంటున్నారు. కాట‌సాని రాంభూపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతున్నారు. కానీ దీనిపై కాట‌సాని మాత్రం ఇంకా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

లోకేష్ పై విమర్శలు:

నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని.. నారా లోకేష్ కు సంస్కారంగా మాట్లాడడం కూడా తెలీదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను చూసి లోకేష్ నేర్చుకోవాలని.. మాజీ సీఎం వైఎస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో లోకేష్ నేర్చుకోవాలని చురకలు అంటించారు. పులికి పులిబిడ్డ పుట్టింది…నక్కకు నక్క బిడ్డ పుట్టిందని.. లోకేష్ బఫున్ కి ఎక్కువ ..జోకర్ కి తక్కువ అని సెటైర్లు వేశారు. సోనియాను ఎదిరించి జగన్ మగాడనిపించుకున్నాడని.. 150 మందిని గెలిపించుకొని రాజశేఖర్ రెడ్డి వారసునిగా జగన్ నిలిచారన్నారు. లోకేష్ ఒక జోకర్.. వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని చురకలు అంటించారు. ప్రశాంతంగా ఉండాలని చెప్పాల్సిన లోకేష్ ప్రతీకారం తీర్చుకుంటామని రెచ్చగొట్టారని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేయకుండా నిలవడం ఎవరితరం కాదని.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏమి చేశారో గుర్తు చేసుకోవాలని మండిపడ్డారు.. “చేరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేసిందెవరు…ఆ కేసులో నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేశారు. చేరుకులపాడు నదయన రెడ్డి హత్యకేసులో ముద్దాయిలను కాపాడింది చంద్రబాబు, లోకేష్ కాదా..” అని ప్రశ్నించారు. ” పెసరవాయి హత్యలపై దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థచే దర్యాప్తు చేయించుకోండి…లేదంటే విదేశీ సంస్థలతో దర్యాఫ్తు చేయించుకోవాలని సవాల్ విసిరారు. పెసరవాయిలో హత్యకు గురైన వారి చరిత్ర అందరికి తెలుసు అన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Assassination politics in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *