మహిళా న్యాయవాదిపై దాడి
-బార్ అసోసియేషన్ సభ్యుల నిరసన
కాకినాడ ముచ్చట్లు:
మహిళా న్యాయవాది పైడి అన్నపూర్ణ పై జరిగిన దాడిని నిరసిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి .,కోర్టు ఆవరణలో నిరసన, సంఘీభావ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి శంకు సింగ్ మాట్లాడుతూ కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యురాలు పైడి అన్నపూర్ణపై ఆమె స్వగ్రామమైన ఆముదాలవలస వనజంగి గ్రామంలో అన్నపూర్ణ కుటుంబ సభ్యులపైన , మహిళా న్యాయవాది అన్నపూర్ణ పైన దాడి చేయడం దారుణం అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కాకినాడ గాంధీనగర్ లో సినీయర్ అడ్వకేట్ కె వివి చలపతి రావు వద్ద జూనియర్ అడ్వకేట్ గా పని చేస్తూ సౌమ్యురాలిగా పేరు సంపాదించిన అన్నపూర్ణ సంక్రాతికి సొంత గ్రామమైన అముదాలవలస వనజంగి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ ఘటన జరిగింది.

Tags: Assault on woman lawyer
