మహిళపై దాడి

తాడేపల్లిగూడెం ముచ్చట్లు:


తాడేపల్లిగూడెం కోతి బొమ్మ సెంటర్ రోడ్ లో పసర్ల చెరువు సమీపంలో అర్ధరాత్రి ఒక మహిళను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అపస్మార్క స్థితిలో ఉన్నా ఆమెను సమీపంలో తుప్పల్లో పడేసి కొంతమంది దుండగులు పారిపోయారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మారం వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు పుట్టేజు ఆధారంగా కేసు వివరాలు పరిశీలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రిరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చెబుతున్నారు. తలపై తీవ్ర గాయాలైన ఈమె వయసు 45 సంవత్సరాలు ఉంటాయి సంఘటన స్థలంలో సైకిల్ కూడా ఉంది. తలకు తీవ్ర గాయమైన ఈమెను గూడెం ఏరియా ఆసుపత్రి నుంచి ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Tags: Assault on woman

Leave A Reply

Your email address will not be published.