పబ్ లో యువకుడిపై దాడి
మాజీ డిజీపీ పుత్రరత్నం నిర్వాకం
హైదరాబాద్ ముచ్చట్లు:
ఏపీ మాజీ డీజీపీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఒక పబ్ లో హల్ చల్ చేసాడు. హైదరాబాద్ లోని ఒక పబ్ లో బుధవారం నాడు ఒక యువకుడిని చితకబాదాడు. దాడి తాలుకు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పై మాజీ డీజీపి గౌతం సావాంగ్ని వివరణ కోరగా అచప స్పందించలేదని సమాచారం. పబ్బులో డీజే పాటలు విషయంలో ఘటన జరిగింది.

Tags: Assault on youth in pub
