జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి ముచ్చట్లు:
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పక్బందీగా , పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు , ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై సెక్టోరల్ ఆఫీసర్స్, మాస్టర్ మాస్టర్ ట్రైనర్స్ , నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నియమ, నిబంధనలపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండటం చాలా కీలకమని, ముఖ్యమైన నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు జరుగ కుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , అర్.డి. ఓ. రమాదేవి , నోడల్ ఆఫీసర్స్ తహసిల్దార్లు, సెక్టోరల్ అధికారులు, ఎం.పి.డి. ఓ లు, మాస్టర్ ట్రైనర్స్, తదితరులు పాల్గొన్నారు.
Tags: Assembly elections in the district should be conducted transparently – District Collector Bhavesh Mishra

