అసెంబ్లీ చివరి సమావేశాలు

Date:12/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి.మూడు నెలల కాలానికి మాత్రమే.. ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆ లోపున… ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది. ఈ సారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు చేసే అవకాశాలు ఉన్నాయి. పింఛన్లు రెట్టింపు చేస్తున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆమేరకు కేటాయింపులు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
చిట్టచివరి సమావేశాలు కావడంతో.. సమావేశాల ప్రారంభంలో గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించే అవకాశముందివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి సమావేశాలు హాజరవుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ అసెంబ్లీ కాలంలో అసలు హాజరు కాబోమని.. గతంలో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు జగన్ పాదయాత్ర పూర్తయింది. ఎమ్మెల్యేలందరూ ఖాళీగానే ఉన్నారు. ఈ సమయంలోనూ.. అసెంబ్లీకి వెళ్లకపోతే.. తీవ్రమైన విమర్శలు వస్తాయి. పైగా.. ప్రతిపక్షం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితుల్ని చక్కగా వినియోగించుకుటుంది.
సంక్షేమ పథకాలతో హోరెత్తిస్తుంది. ఇప్పటి వరకూ.. ఏమైనా లోటు పాట్లు ఉంటే.. వాటి పై పెద్దగా చర్చ జరగకుండా… స్మూత్ గా ఎన్నికలకు వెళ్లిపోతుంది. ఈ విషయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అన్న విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే.. ప్రజాస్వామ్యంపై జగన్ కు నమ్మకం లేదన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.ఒక వేళ అసెంబ్లీకి హాజరైనా.. విమర్శలు వస్తాయి. ఎందుకంటే… ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయలేదన్న కారణంగానే… తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని ఇప్పటి వరకూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు… మళ్లీ ఎందుకు వస్తున్నారన్న విమర్శలు టీడీపీ నుంచి వస్తాయి.
దీనికి సరైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఉంది. అయితే.. ఈ విమర్శల కన్నా.. అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వల్ల వచ్చే విమర్శలే వైసీపీకి ఎక్కువ డ్యామేజీగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని గతంలోనే ప్రచారం జరిగింది. చివరి సమావేశాల్లో అయినా జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags: Assembly meetings last

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *