అసెంబ్లీ స్థానాలు పెంచాలి

హైదరాబాద్ ముచ్చట్లు:

 

విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ లో అసెంబ్లీ సెగ్మెంట్ లు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిథర్ రెడ్డి అన్నారు.  ఆర్టికల్ 370 ఎత్తివేయక ముందు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యంగం ఉంది. ఆర్టికల్ 370 ఎత్తి వేసారు..కాబట్టి ఆర్టికల్ 170 అక్కడ అమలవుతుందని అన్నారు.
దేశంలో ఎక్కడైనా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటె  ఆర్టికల్ 170 సవరించాలి.  రెండు తెలుగు రాష్ట్రాల లలో సీట్ల సంఖ్య పెంచాలంటే ఆర్టికల్ 170ని సవరించడం తప్పనిసరి.  అయితే పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను ఏపీ లో కలిపినప్పటికీ …వాల్లు తెలంగాణ ఓటర్లుగానే ఉన్నారు. 170ఆర్టికల్ ను సవరించకుండా …2018లో  తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో  ఆ 7  మండలాల ఓటర్లను ఆ ఎన్నికల్లో ఓటర్లు గా చూపించలేదు. ఆర్టికల్ 170ని సవరించకుండా ఆ 7 మండలాల ఓటర్లను ఏపీ లో చూపించి కేంద్ర ఎన్నికల కమీషన్ ఈ విషయం లో పెద్ద తప్పు చేసింది. అయితే ..అప్పుడు ఎలా చేసారో ఇప్పుడు కూడా 170ఆర్టికల్ సవరించకుండా  తెలంగాణ ,ఏపీ లో  అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నాని అన్నారు. కాశ్మీర్ తో పాటు తెలంగాణ ,ఏపీ లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలి.  తద్వారా తెలంగాణ లో 34 స్థానాలు ,ఏపీ లో 50 స్థానాలు పెరుగుతాయని అన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Assembly seats should be increased

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *