డిసెంబర్ 2 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

Assembly winter meetings from 2 December

Assembly winter meetings from 2 December

Date:17/11/2019

అమరావతి ముచ్చట్లు:

డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పదిహేను  రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఈ వివరాలు స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో తెలియచేసారు. తమ్మినేని మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ సభుడైనా పార్టీ మారాలనికుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని అన్నారు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే విషయం చెప్పారు. దానికే నేను కట్టుబడి వున్నాను. వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాలి. సభాపతిగా నా వైఖరి కూడా అదేనని స్పష్టం చేసారు. ఏపీలో శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే పేపర్ లెస్ డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్టామని అయన అన్నారు.

 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

 

Tags:Assembly winter meetings from 2 December

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *