పుంగనూరులో కరోనా నియంత్రణకు సహకరించాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో కరోనా తీవ్రమౌతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ కోసం సహకరించాలని చైర్మన్‌ అలీమ్‌బాషా సూచించారు. ఆదివారం పట్టణంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చైర్మన్‌ ఆధ్వర్యంలో చింతలవీధి, కుమ్మరవీధి, కట్టక్రిందపాళ్యెం తదితర ప్రాంతాలలో ఆయా కౌన్సిలర్లతో కలసి చైర్మన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వార్డుల్లో పర్యటి స్తున్నట్లు తెలిపారు. అలాగే కర్ఫ్యూ నిబంధనలను ప్రజలకు వివరించి బయట తిరగరాదని సూచిస్తున్నామన్నారు. ముఖ్యంగా కరోనా సోకిన వారు హ్గం ఐసోలేషన్‌ , కోవిడ్‌ సెంటర్లలో ఉండాలన్నారు. అలాంటి వారికి సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు , ఏఎన్‌ఎంలచే అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. కరోనా భారీన పడిన వారి కుటుంబ సభ్యులు , సన్నిహితులు కూడ బయట తిరగరాదని సూచించారు. వార్డు బాటలో రాష్ట్ర ఎంబిసి కార్పోరేషన్‌ డైరెక్టర్‌ తుంగామంజునాథ్‌, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, మనోహర్‌, అర్షద్‌అలి, రేష్మా, రెడ్డెమ్మ, కాళిదాసు, రాఘవేంద్ర, జెపి.యాదవ్‌ , వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఏఎన్‌ఎంలు , ఆశవర్కర్లు పాల్గొన్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Assist in corona control in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *