Natyam ad

జాతరను పకడ్భంధిగా నిర్వహించేందుకు సహకరించండి

– కమిషనర్‌ నరసింహప్రసాద్‌

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పట్టణంలో ఎంతో వైభవంగా నిర్వహించే శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను పకడ్భంధిగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ కోరారు. గురువారం మున్సిపాలిటిలో సీఐ రాఘవరెడ్డి, ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు , మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రంజిత తో కలసి సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఏఫ్రిల్‌ 2, 3 తేదీలలో జాతర జరుగుతుందన్నారు. వేలాది మంది పాల్గొంటారని తెలిపారు. పారిశుద్ధ్యం, విద్యుత్‌ దీపాలు, మంచినీటితో పాటు చలువ పందిళ్ళు, వైద్య శిభిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్భంధిగా నిర్వహిస్తామన్నారు. సీఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ పలమనేరు డిఎస్పీ మగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. దొంగతనాలు జరగకుండ ముందుజాగ్రత్తగా మఫ్టిలో పోలీసులను నియమించి నియంత్రిస్తామన్నారు. పట్టణంలోనికి భారీ వాహనాలను అనుమతించకుండ , ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తామన్నారు. ప్రజలు జాతరను జయప్రదం చేసేందుకు సహకరించాలని కోరారు. ఈసమావేశంలో డీఈఈ మహేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Assist in organizing the fair

Post Midle