Natyam ad

రైతన్నకు …. భరోసా

పుంగనూరు ముచ్చట్లు:

444

వైఎస్సార్య్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రైతాంగానికి అగ్రస్థానం కల్పించారు. పంటలు పండించేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు క్రిమిసంహారక మందులు సలహాల కోసం రైతులు మండల వ్యవసాయ కార్యాలయాల వద్ద పడి గాపులు కాచేవారు.సరైన సలహాలిచ్చేవారు లేక నాణ్యమైన విత్తనాలు రాకపోవడంతో లక్షలాదిరూపాయలు ఖర్చుచేసిన రైతులు పండించిన పంటలు చేతికందకుండా పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పంటలు వాడే క్రిమిసంహారక మందులు తాగి అదే పంటపొలాల్లో ఆత్మహత్యలకు పాల్పడడం జరిగేది.ఇలాంటి వాటిని ఎన్నికల ముందు జరిగిన పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షున్నంగా పరిశీలించారు.రైతన్నల కష్టాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.ఇందులో భాగంగా రైతులు ముంగిటకు సేవలు అందించేందుకు ఆర్‌బికెలను ఏర్పాటుచేసి రైతుల కష్టాలకు చెక్‌ పెట్టి నేనున్నాంటూ జగనన్న రైతులకు ఆర్‌బికెల ద్వారా చేయూతనందిస్తున్నారు.

Post Midle

పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలున్నాయి. ఈ మండలాల్లో ఒకొక్క ఆర్‌బికె కేంద్రాన్ని సుమారు రూ:20 లక్షల రూపాయలు ఖర్చుచేసి 81 భవనాలు నిర్మించారు. ఇందుకు గానూ వెహోత్తంరూ:16.20 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇప్పటి వరకు ఆర్‌బికెల ద్వారా వెహోత్తం రైతులకు 45119 సేవలందించి ఆదర్శంగా నిలిచారు.

మండలం పేరుఆర్‌బికెల సంఖ్యనిర్మాణ ఖర్చులబ్దిపొందిన రైతులువిత్తనాలు, ఎరువులు అందించిన రైతుల సంఖ్యపుంగనూరు224.40కోట్లు118528658చౌడేపల్లె142.80 కోట్లు59653692సోమల132.60కోట్లు98565623సదుం112.20కోట్లు69504030పులిచెర్ల132.60 కోట్లు57253658రొంపిచెర్ల81.60కోట్లు47713525వెహోత్తం8116.20 కోట్లు4511929186

నాకికష్టాలు తప్పదనుకున్నా……

యాబై ఏళ్లుగా వ్యవసాయం చేసి జీవిస్తున్నాం.మా అవసరాల కోసం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే పుంగనూరు వ్యవసాయ కార్యాలయానికి వెళ్లే వాళ్లం.అక్కడ ఎరువులు, మందులు ఉండదు. చెప్పేందుకు అధికారులు ఉండరు.కానీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దయతో మాకు అందుబాటులో ఆర్‌బికె పెట్టారు.ప్రతి రోజూ సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలిస్తున్నారు. ఎరువులు విత్తాలుకు కొరతేలేదు. మాకు ఇంటికాడ సౌకర్యం కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చల్లగా ఉండాలి.

– ఎం. నారాయణప్ప, కుమ్మరగుంట, పుంగనూరు మండలం.

సులభంగా ఎరువులు విత్తనాలు దొరుకుతున్నాయి……..

గతంలో వేరుశేనగ విత్తనాలకోసం ఎరువుల కోసం చౌడేపల్లెకు వెళ్లి ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు మాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మా ఊరులోని ఆర్‌బికె వద్ద ఎమ్మార్పీ ధరలకే అధికారులు విక్రయిస్తున్నారు. పంటలకు సోకే తెగుళ్లు సస్య రక్షణ మందుల వాడకంపై మా పంటపొలాల్లోకి వచ్చి అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు సలహాలు, ఇచ్చి్య ధిక దిగుబడులు సాధించడానికి మాకు ఎంతో సహకరిస్తున్నారు.

-పి. మురళీ మోహన్‌, రైతు, ఆమినిగుంట, చౌడేపల్లె మండలం.

రైతులకు ఆర్‌బికెల ద్వారానే అన్ని సేవలందిస్తున్నారు……

రైతులకు ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా అన్ని సేవలందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులతోపాటు కొత్తపంటలసాగు, దిగుబడులు పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. రైతులకు ప్రభుత్వ పరంగా లబ్దిచేకూర్చే సేవలు, పథకాలు, రాయితీలుతోపాటు కొత్త వంగడాల సాగుపై ఆర్‌బికే సిబ్బంది రైతులకు అవగాహనకల్పించి నాణ్యమైన సేవలందిస్తూ ఆదర్శంగా నిలిచారు.

-శ్రీరాములు, రైతు, సీతన్నగారిపల్లె, సదుం మండలం

మాఊర్లోనే అన్ని సదుపాయాలు కల్పించారు……

మా ఊర్లోనే రైతులకు అవసరమైన సదుపాయాలు, సేవలతోపాటు యాంత్రీకరణ పనిముట్లు కల్పించారు. ఆర్‌బికెల ద్వారా విత్తనాలు, ఎరువులతోపాటు యాంత్రీకరణ, బిందుసేద్యం ద్వారా పంటల సాగు విధానంపై చైతన్యం కల్పిస్తున్నారు. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంగా తక్కువ పెట్టుబడి ఖర్చుతో అధిక దిగుబడులు స్యాధించడానికి వీలుగా చేపట్టే పంటలసాగుపై దృష్టి సారించేలా అధికారులు తీసుకొన్న చర్యలు అభినందనీయం.ఇలాంటి సదుపాయం కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికు రుణపడి ఉంటాం.

– డిఎస్‌. గోవిందురెడ్డి, రైతు, ముతుకువారిపల్లె, పులిచెర్లమండలం.

Tags: Assurance to the farmer

Post Midle