అడుగడుగునా గరళం 

Date:17/03/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు :
జిల్లాలో ఏజెన్సీ వ్యాప్తంగా 20 గ్రామాలలోని నీరు హాలాహలాన్ని మురిపిస్తోందని నీటి పరిశోధన సంస్థ సర్వేలో తేలింది. తాగునీటి పథకాలు, చేతిపంపులలో ఎప్పుడో బిగించిన తాగునీటి పైపులు తుప్పుపట్టడంతోపాటు నీటి వనరులవద్ద మురుగుచేరి నీరు కలుషితమవుతోంది. వాటిని తాగి అడవిబిడ్డలు వ్యాధుల బారినపడుతున్నారు. ప్రస్తుతం వేసవిలో బోర్ల నీరు మరింత లోతుకి వెళ్లి ఇంకా కలుషితం అయ్యే అవకాశాలున్నయి.నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. అందుకే ‘జీవనం కోసం జలం’ అనే నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ఇచ్చింది. అంతటి ప్రాధాన్యం కలిగిన నీరు క్రమేణా నిర్లక్ష్యానికి గురవుతోంది. నీటి సంరక్షణకు చర్యలు కొరవడుతుండడంతో జలసంక్షోభంతో కరవుకు దారితీయడమే కాకుండా ప్రాణాధారమైన నీరే కలుషితమై ప్రాణపాయంగా ఈ చిత్రంలో కనిపిస్తున్న మలినమైన కలుషిత నీరు ఉట్నూరు మండలం బలాన్‌పూర్‌ గ్రామంలోని చేతిపంపు నుంచి వస్తోంది. ఈ గ్రామంలో 200కుపైగా గిరిజనులు నివసిస్తున్నారు. ఇక్కడ రెండు చేతిపంపులు, రక్షితనీటి పథకం ఉండగా ఒక చేతిపంపు, రక్షిత నీటి పథకం పనిచేయడం లేదు. దీంతో గ్రామస్థులకు మలినంతో వస్తున్న నీరే దిక్కవుతోంది. కలుషితమైన నీటిని తాగడం వలన గ్రామస్థులు వ్యాధుల బారిన పడుతున్నారని వాపోతున్నారు.పారిశుద్ధ్యం లోపించిన తాగునీటి పథకం గాదిగూడ మండలంలోని లోకారి(బి)గ్రామంలోనిది. గ్రామంలోని నిర్మించిన తాగునీటి పథకం పైపులైన్లు లీకేజీ కారణంగా ఇక్కడ రక్షిత నీరు కలుషితమవుతోంది. ఇవీ ఉదాహరణలు మాత్రమే! ఇలా ఏజెన్సీ వ్యాప్తంగా అనేక గ్రామాలలో ఇదే దుస్థితి దర్శనమిస్తోంది.మారుతోంది. ఇందుకు ఏజెన్సీ గ్రామాలే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ సామాజిక బాధ్యతగా ఏజెన్సీలో గిరిపుత్రులు తాగుతున్న నీరు ఎంత సురక్షితం? అనే విషయంలో ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ ప్రాంతాలలోని తాగునీటి నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ప్రముఖ నీటినాణ్యత పరిశోధన సంస్థలో పరీక్షలు చేయించగా 20 గ్రామాలలోని నీరు కలుషితమైనదన్న చేదునిజం నివేదిక రూపంలో బహిర్గతమైంది. ఆ గ్రామాలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు శుద్ధజలం కరవై కలుషితమైన నీరే దిక్కువుతోంది. వెరసి వారు వ్యాధుల బారినపడుతున్నారు.ఏజెన్సీలోని గ్రామాలలో నీరు కలుషితం కావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎప్పుడో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన రక్షితనీటి పథకాలు, చేతిపంపులలోని పైపులు తుప్పుపట్టి పాడైపోయాయి. వాటి ద్వారా సరఫరా అవుతున్న నీరు మురుగుతో కలుషితమవుతోంది. పైపులైన్లు లీకేజీని సరిగ్గా పసిగట్టకపోవడంతోనూ నీరు కలుషితమవుతోంది. గ్రామం రాంనగర్‌. ఉట్నూరు మండలం బిర్సాయిపేట పంచాయతీలోని ఈ గ్రామంలో 150కుపైగా గిరిజనులు నివసిస్తున్నారు. ఇక్కడ ఒకటిరెండు కాదు మొత్తం మూడు చేతిపంపులున్నాయి. కానీ అందులో ఒక చేతిపంపు పనిచేయడం లేదు. మరొకదాని నుంచి నూనెలాంటి రుచికరంగా లేని చిలుము వాసతోకూడిన నీరు వస్తుంది. ఇక గ్రామంలోని మందిరం దగ్గరున్న చేతిపంపే గ్రామస్థుల దాహార్తిని తీర్చేందుకు ఆధారంగా మారడంతో రోజు గ్రామస్థులు అక్కడి నుంచే నీటిని తీసుకెళ్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. కానీ తరుచూ అనారోగ్యం ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో కీళ్లనొప్పులతో సతమతమవుతున్నారు. దీనంతటికి కారణం ఈ గ్రామంలోని నీటిలో ఫోరైడ్‌, నైట్రేట్‌, మాంగనీస్‌తోపాటు వ్యాధికారక సూక్ష్మక్రిమలున్నట్లు వెల్లడైంది. ఇదొక్కటే కాదు ఇలా ఏజెన్సీ వ్యాప్తంగా 20 గ్రామాలలో ఈలాంటి సమస్య నెలకొంది.ఏజెన్సీలోని ఉట్నూరు, నార్నూరు, గాదిగూడ, జైనూరు మండలలో వ్యవసాయం, రైతుల పరిస్థితులను తెలుసుకోడానికి పర్యటించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గ్రామాలలో ప్రస్తుతం తాగు, సాగునీటి పరిస్థితి ఎలా ఉంది? గిరిజనులు తాగుతున్న నీరు సురక్షితమైనదేన అన్న విషయంలో ఆరా తీశారు. గ్రామస్థులతో మాట్లాడగా చాలా గ్రామాలలో తరుచూ వ్యాధులు వస్తున్నాయని వారు చెప్పడంతో ఆ సంస్థ ప్రతినిధులు ఏజెన్సీలోని మొట్టమొదట రాంనగర్‌ గ్రామంలో గ్రామస్థులు తాగుతున్న నీటి నమూనను సేకరించి హైదరాబాద్‌లోని నీటినాణ్యత నిర్ధారణ పరీక్షలు చేసే పరిశోధన సంస్థలో పరీక్ష చేయించగా ఆ గ్రామంలోని నీరు కలుషితమైనదన్న నివేదిక వచ్చింది. దీంతో ఆ సంస్థ చూపిన చొరవ ఫలితంగా ఏజెన్సీ వ్యాప్తంగా మొత్తం 47 గ్రామాలలో సర్వే చేయిచి నిర్ధారణ పరీక్షలు చేయించగా అందులో మొత్తం 20 గ్రామాలలోని నీరు కలుషితమైనట్లు తేలింది.
Tags: At every step

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *