Natyam ad

మొద‌టి ఘాట్ రోడ్డులో ఘ‌నంగా అక్కదేవతల పూజ

తిరుమల ముచ్చట్లు:

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు శుక్రవారం పూజ ఘ‌నంగా జ‌రిగింది. టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన ఈ పూజ కార్యక్రమంలో టిటిడి ఈఓ  ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా అక్క‌దేవ‌త‌ల గుడిని పుష్పాల‌తో అలంక‌రించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపిణీ చేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ర‌వాణా విభాగం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్  శేషారెడ్డి, డిఐలు జానకిరామిరెడ్డి,  మోహ‌న్, డ్రైవ‌ర్లు, ర‌వాణా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags:At the first ghat road, there is a great worship of Akkadevata

Post Midle