సమస్యలు పరిష్కారంలో ముందంజ

At the forefront of solving problems

At the forefront of solving problems

Date:10/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల తహశీల్ధార్‌ కార్యాలయంలో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ముందంజలో ఉన్నారు. వైఎస్సార్సీపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన పర్యవేక్షణలో అన్ని శాఖల్లోను అవినీతి రహితంగా పారదర్శక పాలన చేపట్టారు. ఇప్పటి వరకు తొమ్మిది వారాలు స్పందన కార్యక్రమంలో 236 అర్జీలు తీసుకున్నారు. వీటిలో 9 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో భూముల పేరు మార్పిడికి సంబంధించి ఇప్పటి వరకు 790 వినతిపత్రాలు అందాయి. వాటిలో 52 తిరస్కరించారు. మిగిలినవి పరిష్కరించారు. ఇప్పటి వరకు తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు పర్యవేక్షణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ లేవు.

మధ్యంసేవించి వ్యక్తి మృతి

Tags; At the forefront of solving problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *