అంతక్రియల్లో పాల్గోన్న మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం

At the funeral, Palgona's minister Peddi Reddy's family

At the funeral, Palgona's minister Peddi Reddy's family

Date:10/12/2019

సోమల ముచ్చట్లు:

మండలంలోని అన్నెమ్మగారిపల్లి పంచాయతీ పేటూరుకు చెందిన వైసిపి సినియర్ నేత రామేశ్వర ప్రసాద్ సోమవారం భూతగాదాలతో సోంత అన్న చేతిలో దారుణహత్యకు గురై మృతి చెందారు.ఈయన మంత్రి పెద్దిరెడ్డికి అనుచరుడిగా వున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలత,సదుం మాజీ ఎంపిపి పెద్దిరెడ్డి ఇందిరమ్మ,సోమల మండల పార్టీ ఇన్చార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి,యువనేత పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,నాగ రాజారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి అంతక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సుధీర్ మాట్లాడుతూ రామేశ్వర ప్రసాద్ మృతి పార్టీకి తమకి తీరని లోటు అని ఆవేధన వ్యక్తం చేశారు.ఆయన పార్టీ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు.తమ కుటుంబం మరియు పార్టీ వారి కుటుంబానికి అండగా వుంటుందని భరోసా ఇచ్చారు.వందలాదిగా పార్టీ కార్యకర్తలు నాయకులు తరళివచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో పార్టీ సోమల సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు అమాస మోహన్,నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు గంగాధరం,జిల్లా కార్యదర్శి శీలం భాస్కర,రవీంద్రరెడ్డి,మాజీ ఎంపిపి ఝాన్సీ లక్ష్మీ,వరదం కుమార్ రాజ,శ్రీరాములు,బషీర్ తదితరులు పాల్గొన్నారు.

 

ఉసురు తీస్తున్న రహదారి గోతులు

 

Tags:At the funeral, Palgona’s minister Peddi Reddy’s family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *