Natyam ad

పెళ్లిళ్ల వేళ…దిగొస్తున్న బంగారం, వెండి

ముంబై ముచ్చట్లు:

పసిడి ధర కొద్దిగా తగ్గింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 110 చొప్పున దిగి వచ్చాయి. అయినా, బిస్కట్‌ బంగారం ధర ₹57 వేలకు దగ్గరలోనే ఉంది. కిలో వెండి ధర ₹ 300 తగ్గింది.తెలంగాణలో బంగారం, వెండి ధరలుహైదరాబాద్‌  మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 56,730 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు
విజయవాడలో ‍ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 56,730 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 73,500 గా ఉంది. విశాఖపట్నం  మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలుచెన్నైలో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 52,980 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,790 కి చేరింది.

 

 

Post Midle

ముంబయిలో  22 క్యారెట్ల బంగారం ధర ₹  52,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,730 కి చేరింది.దిల్లీలో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,890 గా నమోదైంది.బెంగళూరులో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,050 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,780 గా ఉంది.మైసూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,050 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,780 గా ఉంది.పుణెలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,950 గా ఉంది.

 

 

 

సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం ‘ప్లాటినం’ ధర 10 గ్రాములకు ₹ 10 తగ్గి ₹ 27,190 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉందిపసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

 

Tags:At the time of weddings… falling gold and silver

Post Midle