పిన్న వయస్సులో రేష్మా రాధోడ్ 

At the youngest was Reshma Radhod

At the youngest was Reshma Radhod

Date:23/11/2018
ఖమ్మం ముచ్చట్లు:
దర్శకుడు మారుతీ దర్శకత్వంలో విడుదలైన ‘ఈ రోజుల్లో’ సినిమా గుర్తుందా? ఈ సినిమాలో కుర్రకారును ఆకట్టుకున్నా రేష్మా రాథోడ్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట బీజేపీలో చేరిన రేష్మా.. ఆ పార్టీకి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నుంచి పోటీ చేస్తున్నారు. రేష్మా ఇదే జిల్లాలో ఇల్లెందులో 1990, నవంబరు 3న జన్మించారు. ఆమె తండ్రి హరిదాస్ రాథోడ్ గోదావరిఖణిలోని సింగరేణి సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి రాధాబాయ్ రాథోడ్ హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. ఆమె సోదరుడు పృథ్విరాజ్ మెడిసిన్ చదువుతున్నారు. 2012లో ‘బాడీగార్డ్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రేష్మా తెలుగు, తమిళం, మలయాళంతో కలిపి 8 చిత్రాల్లో నటించారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 1,825 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే.. వీరిలో అత్యంత పిన్న వయస్సు గల అభ్యర్థి రేష్మా రాథోడే కావడం గమనార్హం. వర్ధన్న పేట నుంచి పోటీ చేస్తున్న పగిడిపాటి దేవయ్య (76) కురువృద్ధ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రేష్మా వైరా (వైరా) నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్, సీపీఐ అభ్యర్థి బానోత్ విజయ‌లపై రేష్మా పోటీ చేస్తున్నారు. మరి, ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా!
Tags:At the youngest was Reshma Radhod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *