Natyam ad

 ఏటీఎం బిర్యానీలు

చెన్నై  ముచ్చట్లు:

చెన్నైలో ఉందీ బిర్యానీ ఏటీఎం. చెన్నైలో బిర్యానీకి ప్రఖ్యాతి గాంచిన ‘బాల్ వీటు కళ్యాణం బిర్యానీ’ లేదా సింపుల్ గా ‘బీవీకే బిర్యానీ’ హోటల్ లో ఈ బిర్యానీ ఏటీఎం ఉంది. ఇప్పటికే చెన్నై నగరంలో ఎక్కడికైనా 60 నిమిషాల్లో బిర్యానీని హోం డెలివరీ చేస్తూ బీవీకే బిర్యానీ ఫేమస్ అయింది. వారి బిర్యానీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందని రివ్యూస్ చెబుతున్నాయి.కూడా సాధారణ ఏటీఎం మెషిన్ మాదిరిగానే ఉంటుంది. కానీ స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉంటుంది. 32 అంగుళాల స్క్రీన్ ను ఈ సర్వీస్ కోసం ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ పై ఆ హోటల్ లో లభించే బిర్యానీల మెన్యూ డిస్ ప్లే అయి ఉంటుంది. మీరు అందులో మీకు కావాల్సినవి సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత డెబిట్, క్రెడిట్, యూపీఐ, లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా బిల్ పే చేయాలి. కొన్ని నిమిషాల్లోనే మీరు కోరుకున్న బిర్యానీ నీట్ గా ప్యాక్ అయి మీ ముందుకు వస్తుంది. బిర్యానీ రెడీ కాగానే మీకు స్క్రీన్ పై ప్రాంప్టింగ్ వస్తుంది. అక్కడ ఓపెన్ డోర్ ఆప్షన్ ను క్లిక్ చేయగానే, డోర్ ఓపెన్ అవుతుంది.

 

 

 

Post Midle

బిర్యానీ ప్యాకెట్ మీ ముందు ఉంటుంది.త్వరలో మరిన్ని బ్రాంచ్ ల్లోనూ ఈ సర్వీసును ప్రారంభించాలని ‘బీవీకే బిర్యానీ’ ఆలోచిస్తోంది. అంతేకాదు, ఇతర నగరాల్లోనూ తమ బిర్యానీ సెంటర్ లను ప్రారంభించే యోచనలో ఉంది.బీవీకే బిర్యానీని 2020లో ప్రారంభించారు. ఇక్కడ బిర్యానీ వండేందుకు ఉపయోగించే ప్రతీ దినుసునూ ప్రత్యేకంగా ఎంపిక చేసి తీసుకుంటామని యాజమాన్యం చెబుతోంది. మసాలా దినుసులను ఏ రోజుకు ఆ రోజు తామే స్వయంగా తయారు చేస్తామని, తాజా చికెన్ లేదా మటన్ ను మాత్రమే వాడుతామని వివరించారు. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ లపై కాకుండా, సంప్రదాయంగా కట్టెల పొయ్యిపై బిర్యానీ తయారు చేస్తామని తెలిపారు.

Tags;ATM Biryani

Post Midle