Natyam ad

ఏపీఐఐసీ ఎండీతో భేటి అయిన ఆత్మకూరు ఎమ్మెల్యే

ఆత్మకూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయవాడలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ పరిధిలోనారంపేట వద్ద గల ఎంఎస్ఎంవి పార్కు అభివృద్ది గురించి పలు విషయాలను ఆయనతో చర్చించారు. రాబోవు రోజుల్లో ఆత్మకూరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది చెందితే నియోజకవర్గంలోవ్యాపారాభివృద్దితో పాటు నిరుద్యోగ సమస్యలు కూడా తొలిగిపోతాయని ఈ సందర్భంగా తెలిపారు.తన సోదరుడు దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం పారిశ్రామికంగాఅభివృద్ది చెందాలనే మహోన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు నాడు సన్నాహాలు చేపట్టరన్నారు.ఆత్మకూరు నియోజకవర్గానికి 3జాతీయ రహదారులు అనుసంధానం కానున్నాయని, తద్వారా పారిశ్రామిక అభివృద్ది మరింత దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ ఎండీ సానుకూలంగా స్పందించారు.

 

Tags: Atmakuru MLA who met APIIC MD

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.