Natyam ad

పుంగనూరులో 14 న వైఎస్ఆర్సిపి యాదవుల ఆత్మీయ సభ

అతిథులుగా మంత్రులు పెద్దిరెడ్డి ,కారుమూరి

-ఎంపీలు మిధున్ ,రెడ్డెప్ప ,మస్తాన్ రావు

-ఏర్పాట్లలో యాదవ సంఘం

 

Post Midle

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్ఆర్సిపి యాదవుల ఆత్మీయ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం రాగానే పల్లి వద్ద గల జగనన్న కాలనీ మైదానంలో నిర్వహించనున్నారు .యాదవ సంఘం నాయకులు వెంకట్ రెడ్డి యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సమావేశం ఏర్పాట్లు ఆదివారం నిర్వహించారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ,రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటినాగభూషణం,  ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డిలు సభా వేదిక ఏర్పాట్లును పరిశీలించారు .సుమారు 15,000 మంది కూర్చునేందుకు వీలుగా సభా వేదికను అత్యంత సుందరంగా నిర్మించారు. వేదికపై సుమారు 25 మంది ప్రజా ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా నిర్మించారు. అలాగే వీఐపీలు, యాదవులు తీసుకొచ్చే వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు. పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ మోహన్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

 

కోస్తా విందు…

 

వైఎస్ఆర్సిపి యాదవ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యే యాదవ కులస్తులకు కోస్తా రుచులతో విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20,000 మందికి చాపల పులుసు, బిర్యాని ,స్వీట్లతోపాటు భోజనం తయారు చేస్తున్నారు. ఇందుకోసం కోస్తా నుంచి సుమారు 50 మంది వంట మనుసులు ఇక్కడికి చేరుకున్నారు .

 

స్వాగత ఏర్పాట్లు …

 

రాష్ట్ర మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ,రెడ్డెప్ప, బీద మస్తాన్ రావులు యాదవ సమావేశానికి అతిధులుగా హాజరు అవుతున్నారు. అలాగే  వీరుతో పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరవుతున్నారు .వీరికి స్వాగతం పలుకుతూ యాదవ సంఘం ప్రతినిధులు రాగానే పల్లె బైపాస్ రోడ్డు వద్ద భారీ ఏర్పాట్లు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు. బెలూన్లు ఏర్పాటు చేశారు. బళ్లారి డ్రమ్ములు, డిజె సాంగ్స్ తో పాటు సభా ప్రాంగణం దద్దరిల్లిపోయేలా మైకులు స్పీకర్లు ఏర్పాటు చేశారు .

సభకు తరలి రండి…

 

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి యాదవుల అభివృద్ధికి కృషి చేశారని పికే ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ తెలిపారు. యాదవుల  ఐకమత్యాన్ని చాటి చెబుతూ, వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే సమావేశానికి యాదవ కుటుంబ సభ్యులు అందరూ వేలాది మందిగా తరలిరావాలని ఆయన కోరారు.

 

Tags:Atmiya Sabha of YSRCP Yadavs on 14th at Punganur

Post Midle