ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య సాయి లక్ష్మిను భర్త సూర్య కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకున్నారు.
Tags: Atrocious.. The husband who killed his wife with a knife..!