మహబూబ్ నగర్ లో దారుణం

Date:13/08/2020

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

మహబూబ్ నగర్‌కు చెందిన డిప్యూటీ ఫారెస్టు రేంజ్ మహిళా అధికారిణి ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. అయితే, ఈమె కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగి ఈమె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీశాఖ కార్యాలయంలో జరిగింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖిల్లా ఘన్‌పూర్‌కు చెందిన వహీదాబేగం (32) మహ్మదాబాద్ ప్రాంత అటవీశాఖ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారిణిగా కొన్నాళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త భానుప్రకాశ్ జిల్లా ఫారెస్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ స్థాయిలో ఉన్నారు. డిగ్రీలో ఉండగా వహీదాబేగం, భానుప్రకాష్‌ మధ్య ప్రేమ ఏర్పడింది. కొన్నిరోజుల తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె (3) కూడా ఉంది.భానుప్రకాశ్‌కు డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న మరో అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోను కావడం వల్లే వహీదాబేగం పురుగుల మందు తాగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే వహీదాబేగం మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అక్రమ  వెంచర్లపై లెక్కలు

Tags: Atrocities in Mahabubnagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *