Natyam ad

నల్గొండ జిల్లాలో దారుణం

నల్గొండ ముచ్చట్లు:
 
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది.  చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీలోని  మైసమ్మ గుడి వద్ద కనిపించిన సీన్ చూసి స్థానికులు హడలిపోయారు. భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతకూ అక్కడ కనిపించిన సీన్ ఏంటంటే.. గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి తల భాగం గుడి ఎదుట వదిలి వెళ్లారు దుండగులు. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతర శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. హత్యా…? లేక నరబలా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు విచారిస్తున్నారు.అసలు ఆ తల ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మైసమ్మ గుడి ముందు మెడలో బొమ్మ తలల దండతో ఉన్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి శరీరం నుంచి వేరుచేసిన తలను వదిలి వెళ్లారు దుండగులు. ఈ ఇన్సిడెంట్ కాలనీలో భయాందోళనలు రేపింది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Atrocities in Nalgonda district