అవనిగడ్డలో దారుణం 

-3వ క్లాస్ విద్యార్థి అనుమానస్పదమృతి

Date:06/08/2019

విజయవాడ ముచ్చట్లు:

కృష్ణా జిల్లా అవనిగడ్డ చల్లపల్లి మండలంలోని బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. 3వ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని దాసరి ఆదిత్య (8)గా గుర్తించారు. హాస్టల్ బాత్ రూమ్ లో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. మంగళవారం తెల్లవారుజామున టాయ్ లెట్ కి వెళ్లిన విద్యార్థులు అక్కడ రక్తపు మడుగులో పడివున్న ఆదిత్యను చూసి షాక్ తిన్నారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే హాస్టల్ అధికారులకు విషయాన్ని చెప్పారు.

 

 

 

వారు పోలీసులకు సమాచారమిచ్చారు.రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆదిత్య మెడపై కత్తితో కోసినట్లుగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడా? ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడపై కత్తిగాటు ఉండటంతో విద్యార్థిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆదిత్య మృతి గురించి తెలిసి అతడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమ కుమారుడు బాగా చదువుకుంటాడని హాస్టల్ లో చేర్పిస్తే… ఇలా శవమై కనిపిస్తాడని ఊహించలేదని ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఎవరితోనూ ఎలాంటి ఆస్తి గొడవలు లేవని.. బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు.

 

 

 

 

దీంతో.. ఈ కేసు ఓ మిస్టరీగా మారింది. అనుమానితులుగా అనిపిస్తున్న వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే మిస్టరీ చేధిస్తామన్నారు. ఆదిత్య అనుమానాస్పద మృతి హాస్టల్ లో కలకలం రేపింది. దీని గురించి అంతా చర్చించుకుంటున్నారు.

 

 

 

 

 

అసలేం జరిగిందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఆదిత్య మృతి సహచర విద్యార్థుల్లో భయాందోళనలు నింపింది. తల్లిదండ్రులు కూడా హాస్టల్ లో ఉంటున్న తమ పిల్లల భద్రత గురించి వర్రీ అవుతున్నారు. తమ పిల్లలకు గట్టి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

వలంటీర్లు బాధ్యతగా పని చేయాలి

Tags: Atrocity in Avinigadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *