Natyam ad

అట్ట హాసంగా బోయకొండ పాలక మండళి సభ్యుల ప్రమాణస్వీకారం- చైర్మన్‌ గా నాగరాజరెడ్డి

– హాజరైన చిత్తూరు ఎంపీ ఎన్‌ రెడ్డెప్ప, పెద్దిరెడ్డిలు
– సాంప్రదాయ రీతిలో భాధ్యతలు స్వీకరణ

 

చౌడేపల్లె ముచ్చట్లు:


పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండళి సభ్యుల ప్రమాణస్వీకారం సోమవారంబోయకొండ గంగమ్మ ఆలయంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిత్తూరు ఎంపీ ఎన్‌. రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిలు హాజరైయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయశాఖ సూచనలమేరకు ఆలయ ఈఓ చంద్రమౌళి సభ్యులు వి. నాగరాస్త్ర రెడ్డి, పి ర జని, కె. రామ్‌దాస్‌, జి.భారతి,ఏ. రాజేష్‌,ఎం. బుడ్డమ్మ,ఎస్‌. పవన్‌కుమార్‌,ఎన్‌. భాస్కర్‌రెడ్డి,సి.లక్ష్మిదేవమ్మ,కె. హైమావతి,డి. రెడ్డెమ్మల చే ప్రమాణస్వీకారం చేయించారు.అలాగె ఎక్సె అఫిషియో మెంబరు గంగిరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేశారు. నూతన పాలక మండళి సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ ఆలయ సాంప్రదాయల ప్రకారం పాలక మండ ళి సభ్యులకు అమ్మవారి శేవవస్త్రంను కప్పి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పికెఎం వుడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జానపద కళల రాష్ట్ర చైర్మన్‌ నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ ఆలీంభాషా,పుంగనూరు, చౌడేపల్లె, బైరెడ్డిపల్లె ఎంపీపీలుఅక్కిసాని భాస్కర్‌రెడ్డి,రామమూర్తి,రెడ్డెప్ప మాజీ ఎంపీపీలు అంజిబాబు, రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ,సదుం జెడ్పిటీసీ సభ్యుడు సోముశేఖర్‌రెడ్డి,మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌,నేతలు చిత్తూరు రాధాకృష్ణ, ఠాణాధార్‌ నాగరాజ,లడ్డూరమణ, తదితరులున్నారు.

Post Midle

 

Tags: Atta Hasanga Boyakonda Governing Council Members Swearing In – Nagaraja Reddy as Chairman

Post Midle