రామేశ్వరం జాలర్లపై లంక సైనికుల దాడి

చెన్నై/పెరంబూర్ ముచ్చట్లు :

 

సరిహద్దులు దాటారంటూ రామేశ్వరం జాలర్లపై విరుచుకుపడిన శ్రీలంక నావికాదళం వారి వలలు, వస్తువులను ధ్వంసం చేసింది. రామేశ్వరంకు చెందిన సుమారు 4 వేల మంది జాలర్లు శనివారం 800 పడవల్లో చేపలవేటకు వెళ్లారు. కచ్చాదీవు సమీపంలో అర్ధరాత్రి చేపల సాగిస్తున్న జాలర్లను అధునాతన బోట్లతో వచ్చిన లంక నావికాదళం చుట్టుముట్టింది. సరిహద్దులు దాటి చేపలవేట సాగిస్తున్నారని లంక సైనికుల హెచ్చరికలతో, జాలర్లు హుటాహుటిన తిరుగు ప్రయాణమయ్యారు. అయినా, వారిని చుట్టుముట్టిన లంక సైనికులు 50 పడవల్లోని వలలు, వస్తువులను ధ్వంసం చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తీరానికొచ్చిన జాలర్లు ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులకు తెలియజేశారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Attack by Lankan soldiers on Rameshwaram fishermen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *