అచ్చంపేట హాస్పిటల్ లో ఘాతుకం…గర్భిణీ పై దాడి….శిశువు మృతి
అర్ధరాత్రి అస్పత్రి ముందు ఆందోళన
అచ్చంపేట ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. డెలివరీ కోసం వచ్చిన గర్భిణీకి నొప్పులు రావడం లేదని చేతులు, ముఖంపై కొట్టారు. కడుపుపై బలంగా కొట్టడంతో శిశువు మృతి చెందింది. మృత శిశువును బయటకు తీసే ప్రయత్నంలో తల్లి తీవ్ర రక్త స్రవానికి గురైంది.దీంతో బంధువులు బుధవారం అస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన మంజుల తొలి కాన్పు కోసం మంగళవారం సాయంత్రం అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. బుధవారం ఉదయం వరకు నొప్పులు రాకపోవడంతో డ్యూటీలో ఉన్న సిస్టర్లు మంజుల ముఖం, చేతుల మీద గట్టిగా కొట్టారని భర్త ఆరోపించాడు. డాక్టర్ వచ్చి చూసి వెళ్లిందే తప్ప ట్రీట్మెంట్ గురించి, పెద్ద హాస్పిటల్ కు పంపిస్తామని చెప్పలేదని వాపోయాడు.

కడుపుపై గట్టిగా కొట్టడంతో లోపల శిశువు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మృత శిశువును బయటకు తీసేందుకు కూడా సరిగ్గా ప్రయత్నించలేదని, విపరీతంగా రక్త స్రావానికి గురైందని ఆరోపించాడు.డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని ఆరోపించారు.రాత్రి 11 గంటల ప్రాంతంలో మంజుల కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బిజెపి, ఎమ్మార్పిస్ నేతలు వీధుల పట్లా నిర్లక్ష్యం వ్యవహరించి నవజాత శిశు మృతికి కారకులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి వరకు ఆసుపత్రిముందు ఆందోళన చేపట్టారు.
Tags: Attack on a pregnant woman in Achampeta hospital.. Baby died
