కల్తీ పాల పై దాడి 

కేవీపల్లె ముచ్చట్లు :

చిత్తూరు జిల్లా   చిన్నగోరంట్లపల్లె లో కల్తీపాలు తయారీ కేద్రం పై దాడులు జరిగాయి.  కల్తీపాలు తయారుచేసే వ్యక్తిని పుడ్ సేఫ్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ,నీళ్ళు, యూరియా, సన్ ఫ్లవర్ నూనె తో పాటు జ్యూస్ మిక్సర్లు స్వాధీనం చేసుకున్నారు. .ఈ క్రమంలో నూనె యూరియా సల్ఫర్ అనే అతి ప్రమాదకరమైన పదార్థాలను వినియోగిస్తున్నారని అధికారులు పరీక్షించి నిర్ధారించారు. పక్కా సమాచారంతోనే నిందితుడు సంజీవరెడ్డి ఇంటిపై తనిఖీలు జరిపారు.  సంజీవ రెడ్డి పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసారు.  విషయం తెలుసుకున్న కె.వి పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Attack on adulterated milk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *